Jai Hanuman: ‘జై హనుమాన్’ మల్టీస్టారర్ సినిమానా.. హైప్ పెంచేస్తున్న న్యూస్

by Chukka Sudharani |

యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), టాలెంటెట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’

Jai Hanuman: ‘జై హనుమాన్’ మల్టీస్టారర్ సినిమానా.. హైప్ పెంచేస్తున్న న్యూస్
X

దిశ, సినిమా: యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), టాలెంటెట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’ (Hanuman) చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. గతేడాది సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఇక ‘హనుమాన్’ చిత్రంతో హీరో తేజా సజ్జాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాన్ ఇండియా (Pan India) లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ‘హనుమాన్’కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ ఉండబోతుందని ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ (sequel) హనుమాన్‌కు మించి ఉంటుందని చెప్పడంతో పాటు.. ఆంజనేయస్వామి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ‘జై హనుమాన్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేస్తుంది. 'జై హ‌నుమాన్‌'ని క‌నీ వినీ ఎరుగ‌ని స్పాన్‌లో తీసే ప్రయ‌త్నాల్లో ఉన్నాడట ప్రశాంత్ వ‌ర్మ. అన్నీ కుదిరితే.. ఇది భారీ మ‌ల్టీస్టారర్ (Multistarrer) అయ్యే అవ‌కాశం ఉందని సమాచారం. ఎందుకంటే.. ఇది హ‌నుమాన్ క‌థ మాత్రమే కాదని స‌ప్త చిరంజీవుల క‌థ‌ని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. మ‌న పురాణాల్లో అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు వీళ్లంద‌రినీ చిరంజీవులుగా పేర్కొన్నారు. వీళ్లంద‌రి క‌థే.. ‘జై హనుమాన్’ అని తెలుస్తుండగా.. ఒక్కో పాత్రకు ఒక్కో స్టార్ హీరోని తీసుకొనున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే ‘జై హనుమాన్’ సినిమాలో మొత్తం తెర నిండా హీరోలే కనిపిస్తారు. ప్రస్తుతం స్క్రిప్టు వ‌ర్క్ (Script work) జ‌రుగుతోందని తెలుస్తుండగా.. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే హనుమాన్ క్యారెక్టర్‌లో స్టార్ హీరో రిషబ్ శెట్టిని తీసుకోగా.. మిగిలిన పాత్రల్లో ఎవరిని తీసుకుంటారో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో నెలకొంది.

Next Story