నితిన్ ‘తమ్ముడు’ నుంచి జై భగలముఖి సాంగ్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న లిరిక్స్

by I. Sairam |

టాలీవుడ్ హీరో నితిన్(Nithin), శ్రీరామ్ వేణు(Sriram) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’(Thammudu).

నితిన్ ‘తమ్ముడు’ నుంచి జై భగలముఖి సాంగ్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న లిరిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నితిన్(Nithin), శ్రీరామ్ వేణు(Sriram) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’(Thammudu). దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజ్(Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సప్తమి గౌడ(Sapathami Gowda) హీరోయిన్‌గా నటిస్తుండగా.. లయ(Laya), స్వశిక(Swashika), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సౌరభ్ సచ్‌దేవా(Sourab Sachdev) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 4న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీమ్ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలోని సెకెండ్ సింగిల్ అయినటువంటి ‘జై భగలముఖి’(Jai Bagalamukhi) సాంగ్ రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ పాటలోని లిరీక్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను ఓ సారి వినేయండి. Link

Next Story