- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jagapati Babu: ‘పెద్ది’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. నా పాత్ర అలా ఉండబోతుంది
పెద్ది సినిమాలో నా పాత్ర చూసి ప్రేక్షకులు సర్ప్రైజ్ అవుతారని జగపతిబాబు చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తాను నటించిన పెద్ది గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తన పాత్ర గురించి మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. జగపతిబాబు మాట్లాడుతూ... “నేను రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాలో నటించాను. ఈ చిత్రంలో నా పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. నా పాత్ర ట్రీట్మెంట్‌ను కూడా బుచ్చిబాబు చాలా కొత్తగా డిజైన్ చేశారు.
సినిమా విడుదలైన తర్వాత నా పాత్రను చూసి ప్రేక్షకులు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు” అని అన్నారు. అలాగే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని, ఇందులో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలకు మంచి గుర్తింపు తీసుకువస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పటికే జగపతిబాబు పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయగా అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆయన పాత్రపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమాతో జగపతిబాబుకు ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి. పెద్ది చిత్రాన్ని జూన్ 4న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.






