- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jagapati Babu: ‘సైరా’ సమయంలో యూరప్‌లో చరణ్ చేసిన పని చూసి షాక్ అయ్యా
‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ యూరప్‌లో జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ అక్కడికి వచ్చారని, సాయంత్రం అయ్యాక యూనిట్ మొత్తానికి 100 యూరోలు ఇచ్చి పార్టీ చేసుకోవాలని చెప్పినట్లు జగపతిబాబు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు తాజాగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను జూన్ 4వ తేదీన విడుదల చేయనున్న నేపథ్యంలో, జగపతిబాబు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రామ్ చరణ్ గురించి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటనను జగపతిబాబు గుర్తుచేసుకున్నారు. జగపతిబాబు మాట్లాడుతూ.. “రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి. పెద్దలకు గౌరవం ఇస్తారు. అలాగే తనతో కలిసి పని చేసే వారిని కూడా ఎంతో బాగా చూసుకుంటారు.
‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమాలో నేను కూడా ఓ పాత్రలో నటించాను. యూరప్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకసారి చరణ్ మా దగ్గరకు వచ్చారు. ఆ రోజు సాయంత్రం వరకు షూటింగ్ స్పాట్‌లోనే ఉన్నారు. తర్వాత సాయంత్రం అయ్యాక యూనిట్‌లోని అందరికీ 100 యూరోలు ఇచ్చి పార్టీ చేసుకోమని చెప్పి వెళ్లిపోయారు. అక్కడే చరణ్ గొప్ప మనసు ఏమిటో అర్థమవుతుంది. ఆయన తన చుట్టూ ఉన్న వారిని ఎంతో బాగా చూసుకుంటారు” అని తెలిపారు. ప్రస్తుతం జగపతిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






