పనిలేని వెదవల గురించి నేను మాట్లాడను.. చరణ్‌పై వచ్చిన ట్రోల్స్‌పై జగపతి బాబు షాకింగ్ రియాక్షన్

by Chukka Sudharani |

రామ్ చరణ్‌పై వస్తున్న ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించాడు నటుడు జగపతి బాబు.

పనిలేని వెదవల గురించి నేను మాట్లాడను.. చరణ్‌పై వచ్చిన ట్రోల్స్‌పై జగపతి బాబు షాకింగ్ రియాక్షన్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబు తన పాత్రపై, అలాగే చరణ్‌పై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. ‘పెద్ది’ చిత్రంలో జగపతిబాబు ‘అప్పలసూరి’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనింపించబోతున్నాడు. ఇది జగపతిబాబుకు రామ్ చరణ్‌తో రెండో సినిమా. మొదట రంగస్థలంలో విలన్‌గా నటించి మెప్పించి.. ఇప్పుడు పెద్దితో మరోసారి తన నెగిటివ్ షేడ్ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తన పాత్రపై మాట్లాడుతూ.. ‘లెజెండ్ తర్వాత నేను దాదాపు 100 సినిమాలు చేశానని అనుకుంటున్నాను. కానీ నాకు కేవలం 5–6 పాత్రలు మాత్రమే గుర్తుండిపోయాయి. వాటిలో పెద్ది సినిమాలోని అప్పలసూరి పాత్ర ఒకటి. సినిమా విడుదలయ్యాక, కచ్చితంగా ఆ పాత్రే అగ్రస్థానాన్ని దక్కించుకోవచ్చు’ అంటూ ధీమా వ్యక్తం చేశాడు.

ఇక చరణ్‌పై వస్తున్న ట్రోల్స్‌పై మాట్లాడుతూ.. ‘పనిలేని వెదవలు గురించి నేను ఎక్కువ మాట్లాడను. ట్రోలింగ్ చేసేవాళ్ళు గుంటకాడ నక్కల్లాంటి వాళ్ళు. వాళ్లకు పనిలేక ఎవర్ని కిందకు లాగుదామా అని ఎదురు చూస్తారు. అసలు చరణ్ ఈ సినిమాకు ఎంతో కష్టపడ్డాడు.. ఎన్నో గాయాలు అయ్యాయి, ఎంత ఎఫర్ట్ పెట్టాడు, ఎంత కష్టపడ్డాడు ఇవన్నీ వదిలేసి ఏదో దొరికితే దాన్ని పట్టుకుంటారు. అసలు ఈవెంట్లో అన్నివేల మంది జనాలు, ఓ పక్క డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్‌కు సంబంధించి హీరోకు కాల్స్ వస్తున్నాయి. అలాగే మరో పక్క థియేటర్స్ ఇష్యూ నడుస్తుంది. ఇవన్నీ హీరో తలపై ఉంటాయి. అవన్నీ మోస్తూ ఇంత హడావిడిలో కొన్ని విషయాలు మర్చిపోవడం సహజం. నేను కూడా మర్చిపోతాను. అంత ప్రెజర్‌లో అలాంటివి జరుగుతాయి. దీన్ని కూడా ట్రోల్స్ చేస్తారా... ఆ ట్రోలింగ్ చేసేవాళ్ళు నాలుగు రోజులు మాట్లాడతారు పోతారు. దీనివల్ల చరణ్‌కి ఏం కాదు’ అని చెప్పుకొచ్చాడు. ‘నన్ను కూడా ఏదో సీన్‌కి 70, 80 టేక్స్ తీసుకున్నా అని ట్రోల్ చేశారు. అసలు అది అబద్దం. నేను మహా అయితే మూడు టేక్స్ తీసుకున్నా ఏమో హైయెస్ట్. దాన్ని కూడా ఫేక్ న్యూస్‌తో ట్రోలింగ్ చేశారు. పని లేకుండా ఇదే పనిగా వాళ్లు ఏదోఒకటి చేస్తూనే ఉంటారు’ అని చెప్పుకొచ్చారు.

Next Story