సౌందర్యతో ఎఫైర్‌పై జగపతి బాబు సంచలన కామెంట్స్! నిజంగా వాళ్ల నాన్న అదే కోరాడా..?

by Hamsa |
సౌందర్యతో ఎఫైర్‌పై జగపతి బాబు సంచలన కామెంట్స్! నిజంగా వాళ్ల నాన్న అదే కోరాడా..?
X

దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు జగపతి బాబు ఒకప్పుడు హీరోగా నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో నటిస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియీలో యాక్టీవ్‌గా తన ఫొటోలతో రచ్చ చేస్తున్నారు.

తాజాగా, ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతి బాబు దివంగత నటి సౌందర్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోయిన్స్‌తో ఎఫైర్ ప్రశ్నలను మీరు ఎందుకు వ్యతిరేకించరు అని యాంకర్ అడగ్గా.. ‘‘దానికి జగపతిబాబు స్పందించారు. మా నాన్న మనకు వారసుడు లేరురా, అందరూ అమ్మాయిలే అన్నాడు. వారసుడు లేకపోతే ఏమవుతుంది నాన్న అన్నాను. ఉండాలి కదరా అన్నాడు. మనం పోయాక ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలాంటప్పుడు వారసుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటీ? అన్నాను. సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కానీ బయట ఎక్కడైనా ట్రై చేయనా అని సరదాగా అన్నాను.

ఈ క్రమంలో ఒక పూజారి నా దగ్గరకు వచ్చి ఫలానా హీరోయిన్ ఉంది సార్ మీరు కలవొచ్చు అన్నాడు. అదే సమయంలో ఓ సినీ పత్రికలో 'జగపతిబాబు సౌందర్యను వివాహం చేసుకోవడం లేదు' అని హెడ్డింగ్ పెట్టి కథనం రాశారు. నేను షాక్ అయ్యాను. అది రాసిన వాడిని అడిగాను. ఇవన్నీ కామన్ సార్ అన్నాడు. వాడిని కలిసినా లాభం లేదు. అప్పుడు నేరుగా ఆ పత్రిక ఎడిటర్ దగ్గరకు వెళ్ళాను. కానీ ఆయన కూడా పట్టించుకోలేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సౌందర్యకు తనకు ఎలాంటి ఎఫైర్ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇద్దరం కలిసి ఎక్కువ సినిమాల్లో నటించడం వల్ల ఆ రూమర్ క్రియేట్ చేశారని.. దానిపై చాలాసార్లు బాధపడ్డానని జగ్గుభాయ్ చెప్పుకొచ్చారు. అయితే వీరిద్దరి ఎఫైర్‌పై దశాబ్దాల తర్వాత కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.

Read More..

రేసుగుర్రం నటుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిన స్టార్ హీరోయిన్!Next Story

Most Viewed