ఉప్పెనలో ఆ కీల‌క పాత్ర‌ మిస్ చేసుకున్న జగపతిబాబు !

by velandi.Saikiran |

ఉప్పెనలో రాయణం పాత్ర‌ మిస్ చేసుకున్నాడు జగపతిబాబు.

ఉప్పెనలో ఆ కీల‌క పాత్ర‌ మిస్ చేసుకున్న జగపతిబాబు !
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగా హీరో వైష్ణవ తేజ్ చేసిన ఉప్పెన మూవీ బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్దరినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, ఈ సినిమాను తెరకెక్కించారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించి.. ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇలా అందరూ ఉప్పెన సినిమాతో తమ కెరీర్ ను పరీక్షించుకొని, సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో 2021లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండ‌స్ట్రీని షేక్ చేసింది. అదే ఊపుతో ఇప్పుడు పెద్ది సినిమా చేశాడు బుచ్చిబాబు.

కాగా, ఉప్పెన సినిమాలో రాయణం పాత్ర‌లో విజయ్ సేతుపతి నటించి ఇండస్ట్రీని షేక్ చేశాడు. అయితే ఈ పాత్ర పై తాజాగా నటుడు జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప్పెన సినిమాలో రాయణం పాత్ర‌ కోసం మొదట బుచ్చిబాబు తనను సంప్రదించినట్లు షాకింగ్ నిజాలను పంచుకున్నారు. అయితే దర్శకుడు బుచ్చిబాబు ఈ కథ చెప్పేందుకు తన ఇంటి వరకు వచ్చి వెళ్ళిపోయినట్లు వివరించారు. ఎందుకు నిర్ణయం మార్చుకున్నారని బుచ్చిబాబును అడిగితే, విజయ్ సేతుపతి మార్కెట్ పెద్దదని చెప్పినట్లు స్పష్టం చేశారు. బుచ్చిబాబులోని ఆ నిజాయితీ తనకు చాలా నచ్చిందని జగపతిబాబు స్పష్టం చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Next Story