- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jackie Chan: జాకీ చాన్‌ను వరించిన జీవన సాఫల్య పురస్కారం
ప్రముఖ యాక్షన్ స్టార్ జాకీ చాన్‌కు (Jackie Chan) ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ యాక్షన్ స్టార్ జాకీ చాన్‌కు (Jackie Chan) ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. జాకీ చాన్ స్టంట్స్ చూసి హాలీవుడ్ జనం సైతం థ్రిల్లయ్యారు. అందుకే ఆయన నటించిన సినిమాలు ఆసియాలోనే కాదు హాలీవుడ్‌లోనూ వసూళ్ల వర్షం కురిపించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జాకీ చాన్‌కు ఉన్న క్రేజే వేరు. అంతేకాదు, యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా, స్క్రీన్ రైటర్‌గా, యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా, సింగర్‌గా, డేర్ డేవిల్ స్టంట్ మేన్‌గా, అథ్లెట్‌గా.. ఇలా ఎన్నో విషయాల్లో జాకీ చాన్ తనకంటూ ప్రత్యేకమైన ముద్రవేసుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా అనుకుంటున్నారా? మరీ అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జాకీ చాన్‌కు విశిష్ట పురస్కారం లభించింది.
లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ( Locarno Film Festival) జాకీ చాన్ జీవన సాఫల్య పురస్కారం (lifetime achievement) అందుకోనున్నారు. 78వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ ఆగస్టు 6న ప్రారంభమై 16వ తేదీ వరకు లాస్ ఏంజిల్స్‌లో జరగనుంది. ఈ సందర్భంగా జాకీ చాన్ ఆగస్టు 9న ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రస్తుతం జాకీ చాన్‌కు 71 సంవత్సరాలు. గతంలో మాదిరిగా స్టంట్స్ చేయకపోయినా ఇప్పటికీ తన మార్క్ ప్రదర్శిస్తూ మూవీల్లో పాత్రలు పోషించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాగా, గత ఏడాది 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌ను ఇదే పురస్కారంతో సత్కరించారు.






