'జాక్' మూవీ ట్విట్టర్ రివ్యూ.. రా ని రాయల్‌గా చూపించాలి ఇలా రోతలా కాదంటూ ఘాటు ట్రోల్స్

by I. Sairam |   (  Updated:2025-04-10 11:25:50  IST  )

రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) మనందరికీ సుపరిచితమే.

జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. రా ని రాయల్‌గా చూపించాలి ఇలా రోతలా కాదంటూ ఘాటు ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) డైరెక్షన్‌లో ‘జాక్-కొంచెం క్రాక్’(Jack Koncham Crack) సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇందులో యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ప్రముఖ నిర్మాత బి వి ఎస్ ప్రసాద్(BVS Prasad) నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇక ఇందులో ప్రకాష్ రాజ్(Prakash Raj), బ్రహ్మాజీ(Brahmaji) వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ మూవీకి అచ్చు రాజమణి(Achu Rajamani) స్వరాలు సమకూర్చారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. మరి ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ హిట్ కొట్టాడో లేదో చూద్దాం..

జాక్ ట్విట్టర్ రివ్యూ.. జాక్‌ కథను సగంలోనే వదిలేసినట్లు అనిపిస్తుంది. అసలు ఏ చోట కూడా కనెక్టివిటీ ఉండదనిపిస్తుంది.. రా ని రాయల్‌గా చూపించాలి.. ఇలా రోతలా కాదు.. ప్రతీ సారి వన్ లైనర్ పంచులతో సినిమా వర్కౌట్ అవ్వదు అని ఇంకా ఎప్పటికీ అర్థం అవుతుందో ఏమో.. ఇంత చెప్పినాక కూడా థియేటర్లో సినిమా చూస్తా అంటే.. మీ ఇష్టం అంటూ ఓ నెటిజన్ ఘాటుగా ట్వీట్ వేశాడు. అలాగే కొందరేమో ఫస్ట్ హాఫ్ పర్లేదు అని చెబుతున్నారు.. కొన్ని చోట్ల సిద్దు కామెడీ వర్కౌట్ అయిందని అంటున్నారు.. బొమ్మరిల్లు భాస్కర్ ఇందులో ప్రతీ ఒక్క ఎమోషన్‌ను వాడుకుని చూపించారని, కాకపోతే అవేవీ కనెక్ట్ కావు అని చెబుతున్నారు.

సెకండాఫ్ తేడా కొట్టేసిందని మరికొందరు అంటున్నారు. జాక్ అనేది ఓ స్పై కామెడీ యాక్షన్ మూవీ అని అందులో స్పై మూమెంట్స్ కానీ కామెడీ కానీ వర్కౌట్ కాలేదని అంటున్నారు. అన్ని కమర్షియల్ అంశాల్ని పొందుపర్చి సినిమాను తీయాలని అనుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్ కానీ అందులో ఏ ఒక్క అంశం కూడా జనాలకు కనెక్ట్ కాకపోవచ్చు అని అంటున్నారు. ఏ ఒక్క సీన్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు.. గందరగోళంగా నడిచే స్క్రీన్ ప్లే.. వీక్ రైటింగ్‌తో బోరింగ్ అనిపిస్తుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు జాక్‌కు దారుణమైన టాక్ వినిపిస్తోంది.

Next Story