షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన జబర్దస్త్ రోహిణి.. నెట్టింట వైరలవుతోన్న ఫొటోలు

by Kodari Anjali |

జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై ఫుల్ క్రేజ్ దక్కించుకుంది నటి రోహిణి. ఈమె జబర్దస్త్ కామెడీ షోలో తన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.

షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన జబర్దస్త్ రోహిణి.. నెట్టింట వైరలవుతోన్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై ఫుల్ క్రేజ్ దక్కించుకుంది నటి రోహిణి. ఈమె జబర్దస్త్ కామెడీ షోలో తన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. జబర్దస్త్ కామెడీ షోలో ఆమె తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. అనేక టీవీ షోలలో అండ్ సినిమాలలో నటించింది. ఒక ప్రసిద్ధ తెలుగు టీవీ హాస్యనటిగా మాత్రమే కాకుండా... రోహిణి సినిమాలలో కూడా నటించింది తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. వీటితో పాటు ఈ అమ్మడు కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా కనిపించింది. ముఖ్యంగా రోహిణి బలగం సినిమాతో మరింత ఫేమ్ దక్కించుకుంది. రోహిణి ఈ మూవీలో సహాయ పాత్ర పోషించింది. అయినప్పటికీ.. మంచి పేరు దక్కింది.

అలాగే కాకుమాను దర్శకత్వం వహించిన సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇందులో రోహిణి పనిమనిషిగా నటించి మెప్పించింది. ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించిన ఈ సిరీస్‌లో ముగ్గురు హీరోలకు జంటగా పావని, జోర్దార్ సుజాత, గంగిరెడ్డి దేవయాని కథానాయకులుగా కనిపించారు. మొదటి సీజన్‌లో అయితే రోహిణి అండ్ అభినవ్ మధ్య వచ్చిన కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఇక సీజన్ 2 కూడా విడుదలై.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో రోహిణి తన కెరీర్ స్ట్రగుల్స్ గురించి వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో కాస్త మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించడం తెలుగు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎప్పుడూ లంగావోణిలో దర్శనమిచ్చే ఈ బ్యూటీ తాజాగా కాస్త షార్ట్ టాప్ ధరించి.. క్యూట్ స్మైల్‌తో కిర్రాక్ ఫొటో షూట్ చేసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా కొంతమంది షాకింగ్ కామెంట్స్ చేయగా.. మరికొంతమంది మేడమ్ సార్ మేడమ్ అంటూ కొనియాడుతున్నారు.instagram link

Next Story