Jabardasth Ram Prasad : క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో మన ముందుకు రానున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్

by Phanindra |

వీరిలో కొందరు హీరోలుగా మారి మూవీస్ చేస్తున్నారు.

Jabardasth Ram Prasad : క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో మన ముందుకు రానున్న జబర్దస్త్ రామ్ ప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్ : జబర్దస్త్ లో చేసిన కమెడియన్స్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో కొందరు హీరోలుగా మారి మూవీస్ చేస్తున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను , ధనరాజ్ , ముక్కు అవినాష్ ఇలా ఎంతో మంది వారి టాలెంట్ ను నిరూపించుకున్నారు. తాజాగా, ఇప్పుడు ఆ లిస్టులో రామ్ ప్రసాద్ కూడా చేరిపోయారు.

రామ్ ప్రసాద్ హీరోగా మన ముందుకు రాబోతున్న చిత్రం W/O అనిర్వేష్. గంగ సప్తశిఖర దర్శకత్వంలో డైరెక్షన్ లో గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై మహేంద్ర గజేంద్ర సమర్పణలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు. జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత చౌదరి.. తదితర నటీ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా W/O అనిర్వేష్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయింది. చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు మూవీని ప్రశంసించారు. డైరెక్టర్ గంగ సప్తశిఖర కొత్త తరహా స్క్రీన్ ప్లే తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటి వరకు వచ్చిన హీరోలు రొటీన్ కథలతో వచ్చారు, కానీ జబర్దస్త్ రాంప్రసాద్ మాత్రం బిన్నంగా కొత్త రకమైన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఎంచుకున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీనిప్రకటించనున్నారు. W/O అనిర్వేష్ మూవీని SKML మోషన్ పిక్చర్స్ ద్వారా ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేయనున్నారు.

Next Story