- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డైరెక్టర్ కానున్న ఆటో రాంప్రసాద్.. సినిమా పనులు ఎక్కడి వరకు వచ్చాయో తెలుసా?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో గెటప్ శీను మాట్లాడుతూ... రాంప్రసాద్ మరికొన్ని రోజుల్లోనే దర్శకుడిగా ఓ సినిమాను మొదలు పెట్టబోతున్నాడని తెలియజేశాడు.

దిశ, వెబ్ డెస్క్ : జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నటులకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ షో వల్ల మంచి గుర్తింపును సంపాదించుకున్న అనేకమంది ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి స్థాయిలో కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంతో గుర్తింపును సంపాదించుకున్న వారిలో కొంతమంది దర్శకులు కూడా అయ్యారు. మొదటగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి క్రేజ్ను సంపాదించుకున్న వేణు 'బలగం' సినిమాతో దర్శకుడు అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈయనకు గుర్తింపు వచ్చింది.
ఈ కామెడీ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ధనరాజ్ కూడా రామం రాఘవం అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. కొన్ని రోజుల క్రితమే అదిరే అభి కూడా చిరంజీవ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ లిస్టులోకి మరో జబర్దస్త్ కమెడియన్ కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు తన ఆటో పంచులతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రాంప్రసాద్. ఈ నటుడు జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, గెటప్ శీను టీంలో అనేక స్కిట్లను వేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
అలాగే ఈ నటుడు కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. ఈయన మరికొన్ని రోజుల్లోనే దర్శకుడిగా సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు తన స్నేహితుడు గెటప్ శీను తెలియజేశాడు. తాజాగా గెటప్ శీను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మరికొన్ని రోజుల్లోనే రాంప్రసాద్ దర్శకుడిగా ఓ సినిమాను ప్రారంభించబోతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని వెల్లడించాడు. ఈయన దర్శకుడిగా సినిమాను మొదలు పెట్టబోతున్నాడని గెటప్ శీను చెప్పడంతో ఇకపై ఇతను కామెడీ షోలలో పాల్గొంటాడా? లేక మొత్తం దర్శకత్వంపైనే ఫోకస్ పెడతాడా అనేది బుల్లితెర అభిమానుల్లో ఆసక్తిగా మారింది.






