- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jabardast varsha: జబర్దస్త్ పోజులతో రెచ్చిపోయిన వర్ష...ఒక్కో ఫోటో ఒక్కో డైమండ్
వర్ష ఈ పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ జబర్దస్త్ వర్ష అంటే గుర్తుపట్టనివారు ఉండరేమో.

దిశ, వెబ్ డెస్క్: వర్ష ఈ పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ జబర్దస్త్ వర్ష అంటే గుర్తుపట్టనివారు ఉండరేమో. కామెడీ షో జబర్దస్త్‌లో ఈ బ్యూటీ చేసిన రచ్చ అలాంటిది. ఇమ్మాన్యూయేల్‌తో కలిసి వర్ష చేసే కామెడీ అంటే ప్రేక్షకులకు చాలా ఇష్టం. అప్పట్లో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారనే పుకార్ కూడా వచ్చింది. ఆ తరవాత షో కోసమే చేశామంటూ బ్యూటీ క్లారిటీ కూడా ఇచ్చేసింది. జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న వర్ష కేవలం ఆ షోకు మాత్రమే పరిమితం కాకుండా ఆ తరవాత చాలా టీవీ షోలలో సందడి చేసింది.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ తగ్గలేదు. దానికి కారణం వర్ష ఫాలోవర్స్‌కు ఇచ్చే గ్లామర్ ట్రీటే అని చెప్పాలి. తరచూ జబర్దస్త్‌లో పొట్టి బట్టలతో సందడి చేసే వర్ష సోషల్ మీడియాలోనూ అలాంటి దుస్తులతోనే ఫోటోలకు పోజులు ఇస్తుంది. కేవలం వెస్ట్రన్ మాత్రమే కాకుండా ట్రెడిషనల్‌లోనూ వర్ష అందాల ఆరబోత మామూలుగా ఉండదు.
ఈ బ్యూటీ ఫోటో అప్లోడ్ చేసిందంటే మినిమమ్ గ్లామర్ షో పక్కాగా ఉంటుంది. దీంతో వర్ష ఫ్యాన్స్ అంతా కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. ఇక తాజాగా బ్యూటీ మరోసారి ఫాలోవర్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. పట్టు లంగా జాకెట్‌లో భారీ అందాలు చూపిస్తూ పోజులు కొట్టింది. ఇక ఫోటోలు చూసిన నెటిజన్లు తమదైన స్టైల్‌లో కామెంట్లు పెడుతున్నారు. ఒక్కో ఫోటో ఒక్కో డైమండ్‌లా ఉందంటున్నారు.






