Ivana: రష్మిక కూడా పొట్టిదే.. నేషనల్ క్రష్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్

by Chukka Sudharani |   (  Updated:2025-07-25 15:19:32  IST  )

2018లో ‘నటసియార్’ చిత్రంతో తమిళ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ ఇవానా.

Ivana: రష్మిక కూడా పొట్టిదే.. నేషనల్ క్రష్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్
X

దిశ, సినిమా: 2018లో ‘నటసియార్’ చిత్రంతో తమిళ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ ఇవానా. తమిళం, మలయాలం భాషల్లో అనేక సినిమాల్లో నటించి.. లవ్ టుడే చిత్రంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇటీవల శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సింగిల్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతానికి మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో.. తాను హైట్ తక్కువగా ఉన్న కారణంగా చాలా సినిమా ఆఫర్స్ కోల్పోయానని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపింది.

అనేక చిత్రాలకు ఆడిషన్‌కు వెళ్లినప్పుడు కూడా హైట్ కారణంగా రిజెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ బ్యూటీ.. హైట్‌పై మరోసారి కామెంట్స్ చేసింది. ‘నా హైట్ తక్కువగా ఉండటం వల్ల నన్ను చాలా సినిమాల్లో రిజెక్ట్ చేశారు. అసలు స్క్రీన్‌కు హైట్ అడ్డురాదని నా అభిప్రాయం. ఎందుకంటే 5 అడుగులు ఉన్నా కూడా కెమెరా యాంగిల్స్ ద్వారా ఆ లోపాన్ని కవర్ చేయోచ్చు. రష్మికా మందన్నా కూడా హైట్ తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారి పాన్ ఇండియా లెవల్‌లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కాబట్టి సినిమాలకు హైట్ అడ్డు కాదు.. హిట్ ఇంపార్టెంట్’ అంటూ తెలిపింది. ఇవానా కాన్ఫిడెంట్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Next Story