అలా చేస్తే చాలా ఇబ్బందిగా ఉంది అన్నా కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు.. యంగ్ బ్యూటీ సీరియస్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), యంగ్ బ్యూటీ రుక్సార్ థిల్లాన్(Ruksar Thillon) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దిల్ రూబా’(Dilruba).

అలా చేస్తే చాలా ఇబ్బందిగా ఉంది అన్నా కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు.. యంగ్ బ్యూటీ సీరియస్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), యంగ్ బ్యూటీ రుక్సార్ థిల్లాన్(Ruksar Thillon) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దిల్ రూబా’(Dilruba). విశ్వకరుణ్(Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలింతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయితే ఈ సినిమా లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల దిల్ రూబా మూవీ రిలీజ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం మార్చి 14న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకొని మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. హీరోయిన్ రుక్సార్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ఆమె మాట్లాడుతూ.. “నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మాట్లాడాలంటే కాస్త భయంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రేక్షకులలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనం జనరల్‌గా ఫొటోస్ తీసుకుంటాం కదా.. మీరు కూడా ఎవరివైనా ఫొటోస్ తీస్తారు. కానీ కాస్తా ఇబ్బందిగా ఉంది అని చెబితే ఎవరిదైన పిక్స్ తీస్తారా..?, లేదా మీరు ఎప్పుడైన అన్ కంఫర్ట్‌గా ఉన్నప్పుడు ఎవరైనా ఫొటో తీస్తే ఊరుకుంటారా..? అయినా నేను కూడా చాలా ప్రేమగా, గౌరవంగా చెప్పాను.

ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది ఫొటోస్ తీయొద్దని అలా చెప్పడం తప్పా..? కాదు కదా.. స్టేజ్ మీద ఇప్పటి వరకు ఏం జరిగింది మీరు చూశారు కదా స్టార్టింగ్ నుంచి ఫొటోస్ తీస్తున్నప్పుడు ఏం జరిగింది చూశారు కదా.. ఎవరి పేర్లు చెప్పను కానీ ఎవరికి అర్థమవ్వాలో వాళ్లకు అర్థమవుతుంది. గౌరవంగా చెప్పినా ఇప్పటికీ ఏం జరుగుతుందో మీరు చూశారు” అంటూ సీరియస్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Next Story