- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను బట్టలు విప్పి తిరిగానా, బికినీ వేసుకున్నానా అనేది నా ఇష్టం.. మీకెందుకు అవన్నీ.. రంగమ్మత్త సెన్సేషనల్ కామెంట్స్
జబర్దస్త్ షో(Jabardasth Show)లో యాంకర్‌గా వ్యవహరించిన అనసూయ(anasuya) మనందరికీ తెలిసిందే.

దిశ, సినిమా: జబర్దస్త్ షో(Jabardasth Show)లో యాంకర్‌గా వ్యవహరించిన అనసూయ(anasuya) మనందరికీ తెలిసిందే. ఆమె యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేసింది. అలా సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కిన ‘రంగస్థలం’(Rangasthalam) సినిమాలో రంగమ్మత్త(Rangamatha)గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ పాత్రకు ఫుల్ మార్కులే పడ్డాయి. రంగమ్మత్త క్యారెక్టర్‌లో ఇరగదీసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
అయితే ఈ బ్యూటీ కొన్ని సినిమాల్లో మెయిన్ లీడ్ కూడా పోషించింది. అలాగే అల్లు అర్జున్(Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన ‘పుష్ప’(Pushpa) మూవీలో దాక్షాయణిగా నెగిటివ్ రోల్‌లో కనిపించింది. అంతే కాకుండా దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2)లో కూడా తన నటనతో అలరించింది. ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి అండ్ ఇతర విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను బట్టలు విప్పి తిరిగానా, బికినీ వేసుకున్నానా అనేది అది నా ఇష్టం. కానీ మీ పెంపకం ఎలా ఉండాలి. మీ ఊహలు మీ పెళ్ళాం, గర్ల్ ఫ్రెండ్‌కే పరిమితం అవ్వాలి. మీరేమన్నా వదిలేసినా ఎద్దులా కాదు కదా మనుషులు. నేను ఎలా డ్రెస్ అవుతాను అనేది నా ఇష్టం. కొంతమంది నీ డ్రెస్ నీ ఇష్టం అంటే నా కామెంట్స్ నా ఇష్టం అంటారు.
నా డ్రెస్ వల్ల నీకు హాని కలగట్లేదు. కానీ నీ కామెంట్స్ వల్ల నాకు హాని కలుగుతుంది. మీరు నన్ను అంటున్నారు. నేను రెడీ అయ్యేది నా కోసం. కానీ మీరు నన్ను కామెంట్స్ చేస్తారు ఆ హక్కు మీకు ఎక్కడిది. నేను కర్మని నమ్ముతాను. కర్మ తిరిగొస్తుంది. నన్ను కామెంట్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఆడవాళ్లు ఉంటారు. కర్మ తిరిగి వస్తుంది’ అంటూ వ్యాఖ్యలు చేసింది. దీంతో సోషల్ మీడియాలో అనసూయ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.






