విషపూరితమైన వ్యక్తులను చూస్తుంటే భయమేస్తుంది.. చర్చనీయాంశంగా మారిన స్టార్ హీరోయిన్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-11 13:26:06  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (trisha) గత రెండు దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా రాణిస్తోంది.

విషపూరితమైన వ్యక్తులను చూస్తుంటే భయమేస్తుంది.. చర్చనీయాంశంగా మారిన స్టార్ హీరోయిన్  పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (trisha) గత రెండు దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా రాణిస్తోంది. ఇక ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. 40 ఏళ్లు వచ్చినప్పటికీ త్రిష పెళ్లి చేసుకోకుండా వరుస చిత్రాల్లో నటిస్తోంది. కొంచెం కూడా అందం తగ్గకుండా గ్లామర్‌ను మెయింటేన్ చేస్తోంది. ఇక ఇటీవల త్రిష విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishvambhara)సినిమాలో నటిస్తోంది. వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఆ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో అషికా రంగనాథ్ కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. త్రిష వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది.

నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఈ భామ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ విషపూరితమైన వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో.. మీరు ఎలా జీవితాన్ని సాగిస్తారు.. ఎలా నిద్రపోతారు. సోషల్ మీడియాలో ఇతరుల గురించి రూమర్స్ క్రియేట్ చేసి అసంబద్ధమైన విషయాలను పోస్ట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల నిజంగా భయంకరంగా అనిపిస్తుంది. నిజంగా ఇదంతా అజ్ఞాత పిరికితనం. దేవుడు మీ అందరినీ నిజంగా ఆశీర్వదిస్తాడు’’ అని రాసుకొచ్చింది. అలాగే ఓ సాడ్ ఎమోజీని కూడా జత చేసింది. ప్రస్తుతం త్రిష పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఆమె ఈ పోస్ట్ ఎందుకు పెట్టిందో అర్థం కాక అంతా తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి త్రిష పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది. అయితే అది చూసిన వారు కొందరు పెళ్లి రూమర్స్ గురించి త్రిష ఇలా రియాక్ట్ అయింది కావచ్చని అంటున్నారు.

Next Story