- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సబ్జెక్ట్‌ను నమ్మి చేసిన సినిమా ‘ఇట్స్ ఓకే గురు’
సాయి చరణ్, ఉష శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఇట్స్ ఓకే గురు’. మణికంఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క్రాంతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే జరిగిన ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా డిసెంబర్ 12న మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్.

దిశ, సినిమా : సాయి చరణ్, ఉష శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఇట్స్ ఓకే గురు’. మణికంఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క్రాంతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే జరిగిన ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా డిసెంబర్ 12న మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ మెహర్ రమేష్.. ‘నేను ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాకు పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాను. బడ్జెట్‌తో సంబంధం లేకుండా సబ్జెక్ట్‌ను నమ్మి చేసిన సినిమా అది. ఆ తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా చూస్తుంటే నాకు మంచి సబ్జెక్టు ఉన్నట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ మణికంఠ, టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. చిన్న సినిమాలు చాలా అద్భుతంగా ఆడుతున్నాయి. ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పాడు. ఇక ఈ కార్యక్రమానికి డైరెక్టర్ మణికంఠ, ప్రొడ్యూసర్ క్రాంతి ప్రసాద్, హీరో సాయి చరణ్, హీరోయిన్ ఉష శ్రీ తదితరులు పాల్గొన్నారు.






