- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇట్స్ అఫీషియల్.. మరోసారి జతకట్టబోతున్న హిట్ జోడీ.. ప్రేమతో నిండిన ప్రయాణం మొదలైందంటూ మేకర్స్ పోస్ట్
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) కాంబోలో వచ్చిన ‘బేబీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) కాంబోలో వచ్చిన ‘బేబీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని మారుతీ, ఎస్‌కేఎన్ నిర్మించగా.. థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సంచనాలు సృష్టించింది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టి పలు అవార్డులు కూడా రాబట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ హిట్ కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా మరోసారి నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన #90s వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్(Aditya Haasan) తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీని నాగవంశీ(Nagavamsi), సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
అయితే ఈ బ్యానర్‌పై 32వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కబోతుంది. ఇక ఈ చిత్రానికి హేషమ్ సంగీతం అందిస్తున్నారు. నేడు మే15న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించారు చిత్రబృందం. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక, వెంకీ అట్లూరీ, శివాజీ, కళ్యాణ్ శంకర్ ముఖ్య అతిథులుగా వచ్చారు. రష్మిక మందన్నా క్లాప్ కొట్టగా.. వెంకీ అట్లూరీ స్క్రిప్ట్ బుక్ డైరెక్టర్‌కు అందించారు. అయితే ఈ సినిమా ప్రేమ కథతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ప్రేమతో నిండిన ప్రయాణం మొదలైనట్లు వెల్లడించారు.
ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మరో హిట్ ఖాయం అని అంటున్నారు. అలాగే రష్మిక వదిన క్లాప్ కొడుతుందని అస్సలు ఊహించలేదని అంటున్నారు. కాగా, గత కొద్ది కాలంగా ఆనంద్ దేవరకొండ అన్న విజయ్, రష్మిక ప్రేమించుకుంటున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటిపై వీరిద్దరు స్పందించకపోవడంతో నిత్యం వీరి ప్రేమకు సంబంధించిన పుకార్లు షికారు చేస్తూనే ఉంటాయి. ఇక కొన్ని సార్లు విజయ్, రష్మిక వెకేషన్స్‌కు వెళ్లి కూడా పట్టుబడ్డారు. ఇక ఇప్పుడు ఏకంగా ఆయన తమ్ముడి సినిమాకు క్లాప్ కొట్టడంతో అంతా వదిన అని అంటున్నారు. అయితే ఆనంద్, రష్మిక మంచి ఫ్రెండ్స్ అని అందుకే ఆమెను పిలిచాడని అభిమానులు వాదిస్తున్నారు.






