ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్టాక్ బస్టర్ హిట్ ‘ఛావా’.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా నటించిన చిత్రం ‘ఛావా’.

ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్టాక్ బస్టర్ హిట్ ‘ఛావా’.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా నటించిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ సినిమా మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చింది. ఫిబ్రవరి 14న థియేటర్స్‌లోకి వచ్చి ఘన విజయం సాధించింది. ఊహించని విధంగా ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులను బద్దలు కొట్టింది. అలాగే ప్రేక్షకులను సైతం కన్నీరు పెట్టుకునేలా చేసింది. దీంతో ‘ఛావా’ చిత్రాన్ని మరోసారి చూసేందుకు సినీ ప్రియులు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా ఎదురుచూస్తున్నారు. తాజాగా, ‘ఛావా’ దాదాపు రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు మాడాక్ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ చూసిన సినీ ప్రియులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story