- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Akhanda 2 : బాలకృష్ణ ఫ్యాన్స్‌కు బిగ్ బ్యాడ్ న్యూస్.. అఖండ 2 పోస్ట్‌పోన్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘అఖండ-2’ రాబోతుంది.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘అఖండ-2’ రాబోతుంది. ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల్లో కూడా భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. అయితే.. ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై క్లారిటీ ఇస్తూ బాంబ్ పేల్చింది మూవీ యూనిట్.
అఖండ-2 వాయిదా పడినట్లు తెలుపుతూ.. ‘గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో అఖండ 2 రాబోతుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనింగ్ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుండి.. ఇండియా సినిమాల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. అలాగే.. ఇందులో నుంచి వచ్చిన టీజర్ అన్ని భాషల్లో సంచలనం సృష్టించి సినిమాపై సరికొత్త అంచనాలను క్రియేట్ చేసింది. మరి ఈ స్థాయి సినిమాకి.. రీ-రికార్డింగ్, VFX అండ్ మొత్తం పోస్ట్-ప్రొడక్షన్ ప్రక్రియకు చాలా శ్రద్ధ అవసరం. అందువల్ల భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావాలంటే మాకు అదనపు సమయం అవసరం. మొదటి భాగం బ్లాక్ బస్టర్ విజయం తర్వాత.. అఖండ 2 ప్రాజెక్ట్ గురించి టీమ్ ఎంతో ఉత్సాహంగా ఉంది. భారీ స్థాయిలో ఎక్కడ రాజీపడకుండా నాణ్యత, ఉత్కంఠభరితమైన విజువల్స్ తో అందించేందుకు టీమ్ విశ్రాంతి లేకుండా 24 గంటలూ కృషి చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొదటగా ప్రకటించిన సెప్టెంబర్ 25 కి కాకుండా.. ముందుకు తీసుకెళ్తున్నాము. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాము. మరింత ఎక్జైటింగ్‌గా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులకు వేచి ఉంటారని ఆశిస్తున్నాము.. అఖండ 2 కేవలం సినిమా కాదు.. అది ఒక సినిమా పండుగ’ అని తెలిపారు. లింక్






