- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) - బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) - బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్‌తో బాలయ్య వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ(Naga Vamshi), సాయి సౌజన్య(Sai Sowjanya)లు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.
ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్(shraddha Srinath) , చాందినీ చౌదరి(chandini Chowdary), ఊర్వశి రౌతేలా(Urvasi Rautela), బాబీ డియోల్‌లు ఇతర కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్‌ఫీస్ వద్ద కలెక్షన్ల సునామీతో పాటు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ-2’(Akhanda-2) సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. బ్లాక్ బస్టర్ అఖండకి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. డాకు మహారాజ్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 21న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి నెట్ ప్లిక్స్(Netflix)లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ‘అనగనగా ఒక రాజు.. చెడ్డవాళ్లు అందరూ దాకు అనేవాళ్ళు... కానీ మాకు మాత్రం మహారాజా’ అంటూ రాసుకొస్తూ ఈ మూవీ ఫిబ్రవరి 21నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తదా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఓటీటీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






