ఇట్స్ అఫీషియల్.. రజనీకాంత్ సినిమాలో బుట్ట బొమ్మ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-02-27 11:46:15  IST  )

‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీలో నాగ చైతన్య(Naga Chaitanya) సరసన నటించిన పూజా హెగ్డే(Pooja Hegde).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

ఇట్స్ అఫీషియల్.. రజనీకాంత్ సినిమాలో బుట్ట బొమ్మ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) మూవీలో నాగ చైతన్య(Naga Chaitanya) సరసన నటించిన పూజా హెగ్డే(Pooja Hegde).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అంతేకాకుండా యూత్ మనసులో క్రష్ అయిపోయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన చిత్రాలన్నిటిలో నటించి మెప్పించింది. ఇక అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’(Ala Vaikuntapuramlo) సినిమాలోని ‘బుట్టబొమ్మ’(Butta Bomma) సాంగ్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది.

అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించిన ఈ బ్యూటీకి సడెన్‌గా వరుస ప్లాప్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ బిరుదుతో పాటు సినిమా చాన్స్‌లు కరువయ్యాయి. దీంతో కొన్ని నెలలు సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఐదు చిత్రాలతో అలరించడానికి మన ముందుకు రానున్నది. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కూలీ’(Coolie). నాగార్జున(Nagarjuna), త్రిష(Trisha), సత్యరాజ్(Sathyaraj), ఉపేంద్ర(Upendra) వంటి ప్రముఖులు ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ మూవీలో యంగ్ బ్యూటీ పూజా హెగ్డే నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ రూమర్స్‌ను నిజం చేశారు మేకర్స్.

ఇందులో భాగంగా రీసెంట్‌గా ఓ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసి ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టాలంటూ పోస్ట్ పెట్టింది. తాజాగా ఆ ప్రీ లుక్ పోస్టర్ పూజా హెగ్డేదేనంటూ కన్ఫార్మ్ చేసింది. అయితే ఇందులో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తుందా లేదా స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రం ఆగస్టులో థియేటర్లలోకి రానున్నట్లు సమాచారం.

Next Story