Vikram: ఇట్స్ అఫీషియల్.. యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వీర ధీర శూరన్ పార్ట్-2’ రిలీజ్ డేట్ ఫిక్స్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్(Chiyan Vikram), అరుణ్ కుమార్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘వీర ధీర శూరన్-2’(Veera Dheera Sooran-2).

Vikram: ఇట్స్ అఫీషియల్.. యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వీర ధీర శూరన్ పార్ట్-2’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్(Chiyan Vikram), అరుణ్ కుమార్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘వీర ధీర శూరన్-2’(Veera Dheera Sooran-2). ఇందులో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య(SJ Surya), సురాజ్ వెంజరమూడు, సిద్ధిక్ (Siddique)కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాను హెచ్‌ఆర్ పిక్చర్స్(HR Pictures) బ్యానర్‌పై రియాశిబు నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ మాత్రం మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని విక్రమ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే అగో వస్తుంది ఇగో ఈ డేట్‌కు అంటూ పలు వార్తలు వైరల్ అయ్యాయి తప్ప మూవీ రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ‘వీర ధీర శూరన్ పార్ట్-2’ (Veera Dheera Sooran-2)రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. మార్చి 27న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో విక్రమ్ కోపంగా చూస్తూ వైల్డ్ లుక్‌లో కనిపించారు.

Next Story