కొన్ని సిట్యువేషన్‌లో నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది.. బుల్లితెర హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-02 02:32:06  IST  )

బుల్లితెర పై సీరియల్స్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న తేజస్విని గౌడ(Tejaswini Gouda) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కొన్ని సిట్యువేషన్‌లో నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది.. బుల్లితెర హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర పై సీరియల్స్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న తేజస్విని గౌడ(Tejaswini Gouda) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ మన్ననలు పొందింది. కన్నడ యాక్టర్ అయినప్పటికీ మన తెలుగు కుర్రాడు అమర్ దీప్‌(Amar Deep)ని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఈ జంటకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం తేజస్విని టీవీ షోలు, సీరియల్స్‌తో బిజీగానే ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆహా ఓటీటీ(AHA OTT)లో వస్తున్న ‘కాకమ్మ కథలు’(Kakamma Kathalu) ఇంటర్వ్యూ ప్రోగ్రాంకి రాగా అక్కడ తన తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.

ఆమె మాట్లాడుతూ.. నేను ఇంటర్ చదివే సమయంలో నా తండ్రి హార్ట్ అటాక్‌తో చనిపోయారు. అలా పెరుగుతున్న ఏజ్‌లో నాన్న లేకపోవడంతో చాలా స్ట్రాంగ్‌ అయ్యాను. ఫాదర్ లేకపోయినా అమ్మ బాగా చూసుకుంది. కానీ నాన్న నాకెందుకు లేరు అని బాధగా ఉంటుంది. గత రెండేళ్లలో వచ్చిన కొన్ని పరిస్థితుల్లో నాన్న ఈ టైంలో ఉంటే బాగుండేది కదా అనిపించేది’ అని చెప్తూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఆమె ఫ్యాన్స్ స్ట్రాంగ్‌గా ఉండండి అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

For Link Click Here

Next Story