- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ustad Bhagat Singh: ఆదివారం నాటికి బ్రేక్ ఈవెన్ అవుతుంది.. మైత్రి రవి
ఉస్తాద్ భగత్ సింగ్ ఆదివారం నాటికి హిట్ స్టేటస్‌ను అందుకుంటుందని మైత్రి నిర్మాత రవి తాజాగా చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈరోజు ఈ చిత్రం విడుదల కాగా, తాజాగా ఈ మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. అందులో నిర్మాత రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. రవి మాట్లాడుతూ... ఈ సినిమా మొదటి నుంచి తాము అంచనా వేసిన విధంగానే నెమ్మదిగా టాక్ పెంచుకుంటూ కలెక్షన్లు పెరుగుతాయని నమ్మకం ఉందని చెప్పారు. ప్రస్తుతం అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోందని, ఈ ట్రెండ్ కొనసాగితే ఆదివారం నాటికి బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా, రాశి ఖన్నా మరియు శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. నేపథ్య సంగీతాన్ని తమన్ కంపోజ్ చేశారు. గతంలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన పవన్–హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అందులోనూ పవన్ మరోసారి పోలీస్ రోల్‌లో కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ చిత్ర నిర్మాత రవి చెప్పిన విధంగా ఆదివారం నాటికి ఈ సినిమా హిట్ స్టేటస్ను అందుకుంటుందో లేదో చూడాలి.






