ఓ వింత సమస్యతో బాధపడుతున్న రణ్‌బీర్‌ కపూర్‌.. దానివల్లే తిన్నా.. మాట్లాడినా..!

by Disha Web Desk 6 |
ఓ వింత సమస్యతో బాధపడుతున్న రణ్‌బీర్‌ కపూర్‌.. దానివల్లే తిన్నా.. మాట్లాడినా..!
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రణ్‌బీర్, స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల వీరిద్దరికి ఓ కూతురు కూడా జన్మించింది.

తాజాగా, రణ్‌బీర్ కపూర్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. రణ్‌బీర్‌కు చిన్నప్పటి నుంచి ఓ వింత సమస్య ఉందట. ఆయనకు ‘నాసల్ డెవియేటెట్ సెప్టెమ్’ అనే సమస్య ఉందని అందుకే భోజనం చేసేటప్పుడు చాలా వేగంగా తింటాడని, మాట్లాడేటప్పుడు కూడా ఇతని మాట తీరు అలాగే ఉంటుందని దానికి కారణం అదే అని సమాచారం. అయితే 2009లో ఓ సినిమా కోసం దర్శకుడు సర్జరీ చేయించుకోమంటే ఆయన తిరస్కరించాడట. ఇకపోతే రణ్‌బీర్‌ కు ఉన్న సమస్య కారణంగా సైనస్ ఇన్ఫెక్షన్లు, గురక, శ్వాస సమస్యలు వంటివి రావడానికి ఆస్కారం ఉంటుందని వైద్యులు తెలిపినా ఆయన తన సమస్యను భరించాలనే నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసి ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి :

ఒంటరిగా బతకడం వల్లే జీవితం అంటే ఏంటో అర్థమవుతుందంటూ.. సమంత పోస్ట్ దానికి అర్థం అదేనా?

‘స్కంద’ ట్రైలర్‌కి డేట్ ఫిక్స్.. అతను గెస్టుగా వస్తే జరిగేది అదే



Next Story

Most Viewed