శ్రీజ వల్ల ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న చిరంజీవి.. కోట్ల ఆస్తులు కూతురికి ఇచ్చేశాడట?

by Hamsa |
శ్రీజ వల్ల ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న చిరంజీవి.. కోట్ల ఆస్తులు కూతురికి ఇచ్చేశాడట?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. అయితే చిరు చిన్న కూతురు శ్రీజ గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో తండ్రి వద్దకు చేరింది. తన వద్దకు వచ్చిన కుమార్తెను చిరంజీవి చేరదీసి కల్యాణ్ దేవ్‌కు ఇచ్చి మళ్లీ చేశాడు. వీరిద్దరికి ఓ కూతురు కూడా జన్మించింది. వీరికి కూడా మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారని గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. గారాబంగా పెంచుకున్న కుమార్తె జీవితం ఇలా అవుతుండటంతో చిరు చాలా బాధ పడుతున్నాడట.

తాజాగా, ఆమెకు ఆస్తులు రాసిచ్చినట్లు ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. చిరు సంపాదన నుంచి కొంత మొత్తం చొప్పున ఆస్తులు రాస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ దగ్గర రూ.35 కోట్ల విలువైన ఓ ఇంటిని చూసి అది నచ్చడంతో వెంటనే కొనేశారట. దానిని తన చిన్న కూతురు శ్రీజ పేరు మీద రాసిచ్చారట. ఇలా తనను ఎంతో బాధపెట్టిన కూతురిని సైతం ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని తెలుస్తోంది.

Read More: పవన్ కల్యాణ్‌ మీద క్రిమినల్ కేసు పెట్టాలి.. ఆర్జీవీ సంచలన ట్వీట్

Next Story