‘సున్నితమైనది కానీ ప్రాణాంతకం’ అంటూ హీరోయిన్ పోస్ట్.. దేని గురించంటే?

by Kodari Anjali |   (  Updated:2025-05-26 04:40:17  IST  )

తమిళ సినిమా కాదలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఐశ్వర్య మీనన్.

‘సున్నితమైనది కానీ ప్రాణాంతకం’ అంటూ హీరోయిన్ పోస్ట్.. దేని గురించంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ సినిమా కాదలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఐశ్వర్య మీనన్. తర్వాత ఎమ్ ఎస్ రమేష్ దర్శకత్వం వహించిన దశావళ చిత్రంతో కన్నడ పరిశ్రమలో అక్షరగా పరిచయం అయింది. జోగి ఫేమ్ ప్రేమ్ సరసన నటించి జనాల్లో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిత్రం 2013 అక్టోబరు 11న విడుదలైన ఈ మూవీలో మానసిక వికలాంగ బాలికగా ఐశ్యర్య నటనకు మంచి ఆదరణ లభించింది.

తర్వాత తమిళంలోనే ఆపిల్ పెన్నే అనే సినిమాలో అవకాశం కొట్టేసింది. ఈ చిత్రం తల్లి, కుమార్తె సంబంధంపై ఆధారపడి ఉంటుంది. కుమార్తెగా ఐశ్వర్య మీనన్, ఆమె తల్లిగా రోజా నటించారు. తర్వాత కన్నడ హర్రర్ కామెడీ నమో బూతాత్మలో నటించింది. ఫహద్ ఫాసిల్‌తో కలిసి నటించింది. ఇక మలయాళంలో రొమాన్స్ చిత్రం మాన్‌సూన్ మ్యాంగోస్‌లోతో ఎంట్రీ ఇచ్చింది.ఇందులో ఆమె ‘ప్రాక్టికల్, స్వతంత్ర యువతి రేఖ పాత్రను పోషించింది.

వీటితో పాటుగా సి.ఎస్ అముధన్ తమిళ్ పదం 2 లోల నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘సున్నితమైనది కానీ ప్రాణాంతకం’’ అని రాసుకొచ్చింది. నెయిల్ పాలిష్ పెట్టుకుంటే ప్రాణాంతకం అనే అర్థంలో నెయిల్ పాలిష్ సింబల్ జోడించింది. అలాగే ఈ పోస్ట్‌లో తన స్టైలిష్ లుక్ ఫొటోలు కూడా పంచుకుంది.

Next Story