నితిన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇష్క్ 2 లోడింగ్

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ లో వ‌చ్చిన బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీస్‌లో ఇష్క్ కూడా ఒకటి. నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచేసింది. ఈ చిత్రానికి బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలోని పాటలు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి.

నితిన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇష్క్ 2 లోడింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ లో వ‌చ్చిన బ్యూటిఫుల్ ల‌వ్ స్టోరీస్‌లో ఇష్క్ కూడా ఒకటి. నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచేసింది. ఈ చిత్రానికి బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలోని పాటలు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. ఒకటి రెండు పాటలు కాకుండా అన్ని పాటలకు శ్రోతలు ఫిదా అయ్యారు. ఈ సినిమాతోనే నితిన్‌కు చాలా కాలం తరవాత హిట్ పడగా, ఇదే సినిమాతో దర్శకుడు విక్రమ్ కే కుమార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సింపుల్ అండ్ క్యూట్ గా వచ్చిన ఈ లవ్ స్టోరీలో నిత్యా మీనన్ మరో హైలెట్ గా నిలిచింది.

ఈ చిత్రం తరవాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా గుండెజారి గల్లంతయ్యిందే సైతం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు పార్ట్ 2 రాబోతుంది. అఫీషియల్ గా ఈ సినిమాను చిత్రయూనిట్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాలో హీరోగా నితిన్ న‌టిస్తుండ‌గా ద‌ర్శ‌కుడిగా విక్ర‌మ్ కే కుమార్, సంగీత ద‌ర్శ‌కుడిగా అనూఫ్ రూబెన్స్ చేయ‌బోతున్నారు. అయితే హీరోయిన్ గా నిత్యానే ఉంటుందా మ‌రెవ‌రినైనా తీసుకుంటారా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story