- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ అంటే రష్మికకు ఇంత ప్రేమా..? మరోసారి నిరూపించుకుందిగా
రష్మిక చేతిపై “ఇర్రీప్లేసబుల్” అనే టాటూ ఉంది. దీనికి “నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు” అనే అర్థం వస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో ఎక్కువగా వార్తల్లో నిలిచే జంటల్లో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఒకరు. వీరిద్దరూ చాలా ప్రేమించుకొని, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో రష్మిక, విజయ్‌పై తన ప్రేమాభిమానాలను పరోక్షంగా వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా రష్మికకి విజయ్ పై ఉన్న ప్రేమ మరోసారి బయటపడింది. రష్మికకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఫోటోలో ఆమె చేతిపై “ఇర్రీప్లేసబుల్” అనే టాటూ కనిపిస్తోంది. ఈ పదానికి “నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు” అనే అర్థం ఉండటంతో, ఇది విజయ్‌పై ఉన్న ప్రేమకు సంకేతమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రష్మిక తన అభిమానాన్ని టాటూ రూపంలో వ్యక్తం చేసిందంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. దీంతో వీరిద్దరినీ “చాలా క్యూట్ జంట” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే వీరిద్దరూ కలిసి ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్నారు.






