ఏంటి ‘బిచ్చగాడు’ సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఇతనా.. ఇంతకంటే దురదృష్టకరం ఇంకేమైనా ఉంటుందా అని కామెంట్స్

by Gugulothu.Kavitha |

కోలీవుడ్ స్టార్ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని(Vijay Antony) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బిచ్చగాడు’(Bichagadu). ఇక దీనికి శశి దర్శకత్వం వహించాడు.

ఏంటి ‘బిచ్చగాడు’ సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఇతనా.. ఇంతకంటే దురదృష్టకరం ఇంకేమైనా ఉంటుందా అని కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని(Vijay Antony) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బిచ్చగాడు’(Bichagadu). ఇక దీనికి శశి దర్శకత్వం వహించాడు. అయితే తమిళంలో ‘పిచ్చైకారన్’ పేరుతో రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘బిచ్చగాడు’ పేరుతో విడుదల చేశారు. అయితే ఈ మూవీ ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు-2 మాత్రం పార్ట్-1 అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే… తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న పిచ్చైకారన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారట దర్శక నిర్మాతలు. అయితే ఈ చిత్రంలో హీరో పాత్ర కోసం నటుడు శ్రీకాంత్‌ను సంప్రదించారట. ఈ మూవీ ప్రివ్యూ చూసిన శ్రీకాంత్.. కథ బాగా నచ్చడంతో రీమేక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలాగే తమిళంలో ఉన్న సెంటిమెంట్ కంటే మరింత ఎమోషన్‌తో తెరకెక్కించారనుకున్నారని.. అయితే హీరో రెమ్యునరేషన్ ఎక్కువ కావడంతో బడ్జెట్ మరింత పెరిగిపోతుందనే ఉద్దేశంతో రీమేక్ వదిలేశారట.

దీంతో బిచ్చగాడు పేరుతోనే అదే చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా హీరో శ్రీకాంత్ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా. ఇంత కంటే దురదృష్టకరం ఇంకేమైనా ఉంటుందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story