కొరటాల స్పీడ్‌కు అసలు కారణం ఇదేనా? ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ

by Pulgam srinivas |

తారక్ ఫ్రీ అయ్యేలోపు ఒక సినిమా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే కొరటాల శివ, బాలయ్యతో కొత్త ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకున్నట్లు సమాచారం.

కొరటాల స్పీడ్‌కు అసలు కారణం ఇదేనా? ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన వారిలో కొరటాల శివ ఒకరు. వరుస విజయాలను అందుకున్న ఈయన, ఆచార్య సినిమాతో భారీ ప్లాప్ అందుకోవడంతో ఈ దర్శకుడి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న కొరటాల, జూనియర్ ఎన్టీఆర్ తో దేవర పార్ట్-1 చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన వెంటనే దేవర-2ను స్టార్ట్ చేస్తారని చాలామంది భావించారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా ప్రారంభం కాలేదు. మధ్యలో కొన్ని సార్లు దేవర-2 ఉండదని వార్తలు వచ్చాయి.

అలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా దేవర-2 కచ్చితంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇదే సమయంలో కొరటాల శివ కూడా బాలకృష్ణతో ఓ సినిమా సెట్ చేసుకున్నాడు. దీంతో దేవర-2 ఉండదనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ప్రశాంత్ నీల్ తారక్‌తో రూపొందిస్తున్న సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా మొదటి భాగంతో పాటు రెండో భాగం షూటింగ్‌ను కూడా ఒకేసారి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ రెండు భాగాల షూటింగ్ పూర్తవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆలోపు బాలకృష్ణతో ఓ సినిమా పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొరటాల శివ కొత్త ప్రాజెక్ట్‌ను ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి కాగానే దేవర-2 ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story