పవన్ 'బాలు' మూవీ ప్యాంట్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా.. నిర్మాత ఆఫర్ కూడా రిజెక్ట్

by Pulgam srinivas |

బాలు సినిమా కోసం పవన్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ప్యాంటు ఖరీదు 1 లక్ష 40 వేలు. దీనిని డిజైన్ చేయడానికి ఇటలీలోని హాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేశారు. ఆయనకు రేణు దేశాయ్ కూడా సహాయం చేశారు.

పవన్ బాలు మూవీ ప్యాంట్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా.. నిర్మాత ఆఫర్ కూడా రిజెక్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2005లో బాలు అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కంటే ముందు వీరిద్దరి కాంబోలో రూపొందిన తొలిప్రేమ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో మొదటి నుండి బాలుపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ హైప్ కి తగినట్లుగానే ఈ సినిమాలోని ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైంది. కానీ ఈ మూవీ ఆ స్థాయి విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.

ఈ సినిమా విడుదలకు ముందు అత్యంత పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన ఒక అంశం ఉంది, అదే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ప్యాంట్. బాలు చిత్రం కోసం పవన్ కళ్యాణ్ డిజైన్ చేయించుకున్న ప్యాంట్ ఖరీదు ఆ సమయంలోనే 1 లక్ష 40 వేలు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఇటలీలోని హాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్తో ఈ ప్యాంటును పవన్ డిజైన్ చేయించారు. రేణు దేశాయ్ కూడా ఇందులో సహాయపడ్డారు. ఈ సినిమా నిర్మాత అయిన అశ్విని దత్ ఈ ప్యాంటుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పినా అందుకు పవన్ ఏ మాత్రం అంగీకరించకుండా తన సొంత డబ్బుతోనే దానిని డిజైన్ చేయించుకున్నాడు.

అప్పట్లోనే ఇంత ఖర్చు పెట్టి ప్రత్యేకంగా ఈ సినిమా కోసం ఓ ప్యాంట్ డిజైన్ చేయించడంతో దీని గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ అయినా కూడా ఈ సినిమాలోని పవన్ లుక్స్, యాక్టింగ్, డ్రెస్సింగ్ స్టైల్ కి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. పవన్ కళ్యాణ్, శ్రియ శరన్, నేహా ఒబెరాయ్, గుల్షన్ గ్రోవర్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించగా మణిశర్మ సంగీతం అందించాడు.

Next Story