- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారా హీరోతో అల్లరి నరేశ్ కామెడీ ఎంటర్‌టైనర్ ?
నారా రోహిత్ అలాగే అల్లరి నరేష్ కాంబినేషన్ లో అదిరిపోయే మల్టీస్టారర్ సినిమా రాబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. ఈ మేరకు ఈ ఇద్దరి హీరోల మధ్య చర్చలు కూడా జరిగాయట.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కామెడీ, థ్రిల్లర్, హారర్, సైబర్ క్రైమ్ నేపథ్యంలో రకరకాల సినిమాలు వస్తున్నాయి. మరికొన్ని మల్టీ స్టారర్ సినిమాలు వచ్చి , సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని సినిమాలు మాత్రమే బాగా ఆడుతుండగా, మరికొన్ని సినిమాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు ఊహించని మల్టీస్టారర్ కామెడీ సినిమా రాబోతోంది. అల్లరి నరేష్, నారా రోహిత్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
నారా రోహిత్-అల్లరి నరేష్ కాంబినేషన్ లో కొత్త సినిమా ?
నారా రోహిత్ (Nara Rohit) అలాగే అల్లరి నరేష్ ( Allari Naresh) కాంబినేషన్ లో అదిరిపోయే మల్టీస్టారర్ సినిమా రాబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. ఈ మేరకు ఈ ఇద్దరి హీరోల మధ్య చర్చలు కూడా జరిగాయట. ఈ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారట. హరీష్ పెద్ది నిర్మాతగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నారా రోహిత్ తో ఇప్పటికే సుందరకాండ అనే సినిమా చేశారు వెంకటేష్ నిమ్మలపూడి. అయితే ఇప్పుడు నారా రోహిత్, అల్లరి నరేష్ కాంబినేషన్ లో కొత్త సినిమా చేసేందుకు సిద్ధమయ్యారట.
ఈ సినిమా పూర్తిగా కామెడీ అలాగే ఎమోషన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు బాగా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఈ మేరకు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, నారా రోహిత్, అల్లరి నరేష్ ఇద్దరికీ ఈ మధ్య కాలంలో మంచి సినిమా పడలేదు. హిట్ కోసం ఇద్దరూ హీరోలు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటిది నారా రోహిత్, అల్లరి నరేష్ కాంబోలో సినిమా వచ్చి సక్సెస్ అయితే, మాత్రం మంచి పరిణామం అని చెప్పవచ్చు.






