- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ పరిశ్రమ ఓటీటీ చేతుల్లోకి వెళ్లిపోతోందా.. తప్పు ఎక్కడ జరిగింది?
సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కావటం, విడుదలైన తర్వాత తక్కువ రోజుల్లో ఓటీటీలకి రావటం వల్లే జనాలు థియేటర్కు రావటం లేదు. అందుకే ఈ సంస్థలు నిర్మాతలకు కొత్త కండిషన్లు పెడుతున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇండియాలో ఓటీటీ కంటెంట్ చూసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడైతే మన దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి పరిస్థితులు చాలా వరకు మారాయి. కరోనా ఉగ్రరూపం దాల్చడంతో చాలా రోజులపాటు సినిమా థియేటర్లు మొత్తంగా మూసేశారు, అలాగే షూటింగ్ జరగకపోవడంతో కనీసం టీవీల్లో కూడా న్యూ కంటెంట్ కరువైంది. దానితో ఇంట్లో ఖాళీగా ఉన్నవారు కొత్త కంటెంట్ కోసం వెతకడం మొదలుపెట్టారు.
అలా ఓటీటీలకి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. మొదట్లో ఓటీటీ ఆఫర్లు సినిమా నిర్మాతలకు వరంలా మారాయి. ఒక సినిమాను రూపొందిస్తే దానికి థియేటర్, సాటిలైట్, డిజిటల్, మ్యూజిక్, రీమేక్ ఇలా అనేక హక్కుల ద్వారా డబ్బులు వచ్చేవి. ఎప్పుడైతే ఓటీటీల ప్రభావం భారీగా పెరిగిపోయిందో, కొంతమంది సినిమాలు నేరుగా అందులోనే విడుదల చేయడం, మరి కొంతమంది చాలా తక్కువ రోజులకే సినిమాను డిజిటల్ ఫ్లాట్ఫామ్ లోకి తీసుకురావడంతో ప్రేక్షకులు థియేటర్కు వెళ్లి సినిమా చూడడం చాలా వరకు తగ్గించారు. దానితో ఓటీటీ యాజమాన్యాలు తమ డిమాండ్లు పెంచడం మొదలుపెట్టాయి.
ప్రస్తుతం ప్రధానంగా మూడు ఓటీటీలు ఇండియా వ్యాప్తంగా చాలా యాక్టివ్గా ఉన్నాయి. అవి కేవలం ఇండస్ట్రీ నుండి ఏడాదికి 160 సినిమాలు మాత్రమే విడుదల చేయడానికి గరిష్టంగా టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దానితో చాలా సినిమాలు డిజిటల్ అమ్మకాలు జరగక అలాగే ఉండిపోతున్నాయి. కొన్ని సినిమాలకు అమ్మకాలు జరిగిన కూడా వాటి విడుదల తేదీలను ఓటీటీలు కంట్రోల్ చేస్తున్నాయి. దానితో తక్కువ రోజుల్లో ఓటీటీలో సినిమాలను తీసుకురావడం వల్లే ఇలా జరుగుతుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.






