సమంత సినిమా నుంచి ఆ నిర్మాత తప్పుకోవడానికి అసలు కారణం అదే?

by Pulgam srinivas |

'మా ఇంటి బంగారం' చిత్రాన్ని మొదట రామ్ తల్లూరి నిర్మించాలని భావించినప్పటికీ, చివరి నిమిషంలో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

సమంత సినిమా నుంచి ఆ నిర్మాత తప్పుకోవడానికి అసలు కారణం అదే?
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ బ్యూటీ సమంత తాజాగా 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, సమంత రూత్ ప్రభు, హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు. ఇలా ఈ సినిమా నిర్మాణంలో సమంత కూడా భాగస్వామిగా నిలిచింది. అయితే మొదట ఈ సినిమాను సమంత కాకుండా రామ్ తల్లూరి నిర్మించాలని భావించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పలు పనులను కూడా పూర్తి చేశారు.

కానీ చివరి నిమిషంలో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో సమంత ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. సమంత స్వయంగా ఈ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకోవడంతో, అప్పటికే నిర్మాతగా ఉండాల్సిన రామ్ తల్లూరి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోనే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Next Story