ప్రదీప్ రంగనాథన్ అకౌంట్లో ఆ రికార్డు మిస్ అయినట్టేనా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-09 21:43:56  IST  )

కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఈ ఏడాది నిజంగానే ఫైర్ డ్రాగన్

ప్రదీప్ రంగనాథన్ అకౌంట్లో ఆ రికార్డు మిస్ అయినట్టేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఈ ఏడాది నిజంగానే ఫైర్ డ్రాగన్ గా కనిపిస్తున్నాడు. డ్రాగన్, ‘డ్యూడ్’ రెండూ బ్యాక్-టు-బ్యాక్ రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎక్కాయి. ఈ హ్యాట్రిక్ హిట్ హంగామాలోనే ఆయన నెక్స్ట్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) కోసం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో, అనిరుధ్ మ్యూజిక్‌తో, కృతి శెట్టి హీరోయిన్‌గా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ని డిసెంబర్ 18న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మొదట ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్‌లో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది.

రిలీజ్‌కి ఇంకా పది రోజులే ఉనప్పటికీ ప్రమోషన్స్ అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. తమిళంలో కొన్ని టీజర్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు జరిగినా… తెలుగులో మాత్రం పూర్తి సైలెంట్ గా ఉన్నాడు. ఒక్క పోస్టర్, ఒక్క టీజర్ కూడా ఇంకా రాలేదు. దీంతో ట్రేడ్ సర్కిల్స్‌లో బలమైన టాక్ నడుస్తోంది: “LIK డిసెంబర్ 18న రాదు, పోస్ట్‌పోన్ అవుతుంది అని చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణాలు కూడా చెప్తున్నారు. డిసెంబర్ 20న ‘కెప్టెన్ మిల్లర్’, ‘సర్కారు నూకలు’ లాంటి భారీ చిత్రాలు వస్తున్నాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ స్పెషల్‌గా ‘కూలీ’, ‘విడుదల పార్ట్ 2’ రేసులో ఉన్నాయి. అంటే డిసెంబర్ నెలాఖరున భారీ క్లాష్ ఉంది. ఈ నేపథ్యంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో టీమ్ సేఫ్ గేమ్ ఆడి, జనవరి లేదా ఫిబ్రవరిలోకి షిఫ్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Next Story