Kiara Advani: కియారా అద్వానీకి కవలలు జన్మించనున్నారా..ఈ రకంగా హింట్ ఇచ్చిన నటి?

by Kodari Anjali |

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Kiara Advani: కియారా అద్వానీకి కవలలు జన్మించనున్నారా..ఈ రకంగా హింట్ ఇచ్చిన నటి?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ షెర్షా సినిమాలో నటించే క్రమంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడింది. వీరిద్దరు బాలీవుడ్‌లో స్టార్ గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రేమలో పడ్డాక రెండేళ్లు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 7 వ తారీకున 2023 న కుటుంబ సభ్యుల నడుమ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే.. కియారా అద్వానీ త్వరలో తల్లి కాబోతుంది. ఈ జంట ఇప్పుడు మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే నెటిజన్లలో కియారాకు కవలలు పుట్టనున్నారా? మగబిడ్డనా? లేక ఆడబిడ్డనా ? అని ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. కియారా అద్వానీ కవలల గురించి స్పష్టంగా ఏ అధికారిక ప్రకటన చేయలేదు. ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ల కారణంగా ఆమెకు కవలలు పుట్టవచ్చని అభిమానులు ఊహిస్తున్నారు. ఆమె ఇంటర్వ్యూలో తనకు కావాల్సినది ఇద్దరు ఆరోగ్యకరమైన పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు కియారాకు కవలలు పుట్టబోతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కియారా ఈ విధంగా హింట్ ఇచ్చిందని నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story