రామ్ ఫార్ములాను ఫాలో కాబోతున్న కార్తికేయ?

by Pulgam srinivas |

కార్తికేయ ప్రస్తుతం తన కోసం తానే ఓ కథను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

రామ్ ఫార్ములాను ఫాలో కాబోతున్న కార్తికేయ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో కార్తికేయకు మంచి గుర్తింపు లభించింది. అయితే, ఆ తర్వాత ఆయన నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి. ఆఖరుగా కార్తికేయ ‘భజే వాయు వేగం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించగా, ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, కార్తికేయ తన కోసం తానే ఓ కథను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆ కథ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. అయితే, కథ పూర్తయ్యాక ఆ సినిమాకు కార్తికేయ స్వయంగా దర్శకత్వం వహిస్తాడా? లేక మరో దర్శకుడికి ఆ బాధ్యతలు అప్పగిస్తాడా? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, హీరో రామ్ పోతినేని కూడా తనకోసం ఓ కథను సిద్ధం చేసుకుని, దానికి తానే దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మరి రామ్ మాదిరిగానే కార్తికేయ కూడా తాను రాసుకున్న కథకు దర్శకత్వం వహిస్తాడా? లేదా? అనేది చూడాలి.

Next Story