సూర్య 48కు దర్శకుడు ఖరారు?

by Pulgam srinivas |   (  Updated:2026-06-08 06:12:58  IST  )

సూర్య తదుపరి మూవీని పా రంజిత్ దర్శకత్వంలో చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

సూర్య 48కు దర్శకుడు ఖరారు?
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా ‘కరుప్పు’ చిత్రంతో సూపర్ సాలిడ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే సూర్య తదుపరి చిత్రానికి సంబంధించిన ఓ కీలక వార్త ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్య తన నెక్స్ట్ మూవీని పా రంజిత్ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే పా రంజిత్ ఓ కథను సూర్యకు వినిపించగా, అది ఆయనకు బాగా నచ్చినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై సూర్య కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మరికొన్ని రోజుల్లోనే ఈ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘కరుప్పు’ వంటి భారీ సక్సెస్ తర్వాత సూర్య ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడనే ఆసక్తి కోలీవుడ్ వర్గాల్లో కూడా బలంగా నెలకొంది.

మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ తేదీన ఓటీటీలోకి ‘కరుప్పు’

Next Story