- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆ తేదీన ఓటీటీలోకి ‘కరుప్పు’
సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’ మూవీ జూన్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘కరుప్పు’ చిత్రం కొన్ని రోజుల క్రితం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి తాజాగా ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం జూన్ 12వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరో రెండు, మూడు రోజుల్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.






