- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడు మాజీ మంత్రి రోజా ఎత్తుకొని ఆడించిన చిన్నబాబు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోనా?
ఏపీ మాజీ మంత్రి రోజా(Former Minister Roja) ప్రస్తుతం చెన్నై(Chennai)లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ మంత్రి రోజా(Former Minister Roja) ప్రస్తుతం చెన్నై(Chennai)లో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల వైసీపీ నాయకురాలు రోజా కూటమి ప్రభుత్వాన్ని(AP Government) సూపర్ సిక్స్(Super Six) హామీలు ఎప్పుడు అమలు చేస్తోంది నిలదీసిన విషయం తెలిసిందే. టైమ్ దొరికితే కూటమి ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి రోజా ఓటమి పాలైన విషయం తెలిసిందే.
ఇక అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మళ్లీ సినిమాలు స్టార్ట్ చేస్తోందనే టాక్ వినిపించింది.. కానీ ఇప్పటి వరకు ఆమె ఈ విషయం పై ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ.. రోజా ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. అప్పట్లో రోజాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి సుమన్, వినోద్ లాంటి హీరోల వరకు.. స్టార్స్ అందరితో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించింది.
ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి రోజాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. పాన్ ఇండియాను ఊపేస్తున్న ఓ హీరోను అప్పట్లో రోజా ఎత్తుకుని పెంచిందని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఆమె ఎత్తుకున్న ఆ చిన్న బాబు ఎవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. షూటింగ్ టైమ్‌లో ఎత్తుకుని ఆడించేదట. ఇక ముఠామేస్త్రి మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్ కు రామ్ చరణ్(Ram Charan) ఎక్కువగా వచ్చేవాడట. అప్పుడు చాలా చిన్నవాడు కావడంతో బాగా అల్లరి చేసేవాడట.
ఈ క్రమంలో ఆమె ఎత్తుకుని ఆడించేవారని చెప్పుకొచ్చారు. చాలా చిన్నప్పుడు రామ్ చరణ్ బాగా హుషారుగా ఉండే వారు ఎక్కువ అల్లరి.. పట్టుకోలేకపోయాం అని చెప్పారు. స్కూల్ లో జాయిన్ అయ్యాక అల్లరి తగ్గిందని ఆమె తెలిపారు. ఈ మేరకు గత ఏడాది రోజా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఈ విషయాలను మాజీ మంత్రి రోజా వెల్లడించారు.






