తెలుగులోకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా ‘మఫ్టీ పోలీస్’..

by Chukka Sudharani |

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ, ఐశ్వర్య రాజేష్‌ల పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా ‘తీయవర్ కులై నడుంగ’.

తెలుగులోకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా ‘మఫ్టీ పోలీస్’..
X

దిశ, సినిమా: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ, ఐశ్వర్య రాజేష్‌ల పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా ‘తీయవర్ కులై నడుంగ’. ఈ సినిమా తెలుగులో ‘మఫ్టీ పోలీస్’గా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్సార్ అర్ట్స్ బ్యానర్‌పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని... తెలుగులో ప్రముఖ నిర్మాత ఎ. ఎన్. బాలాజీ శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ అధినేత ఎ. ఎన్. బాలాజీ మాట్లాడుతూ... ‘యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్‌లకు తెలుగునాట ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక థియేటర్లలో ‘మఫ్టీ పోలీస్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో యాక్షన్‌తోపాటు పర్సనల్ డ్రామా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళంతోపాటు తెలుగులోనూ అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అద్భుత అవకాశాన్ని నాకు అందించిన జి.అరుల్ కుమార్‌కి, ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు దినేష్ లక్ష్మణన్‌లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అన్నారు. ఇందులో రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Next Story