Lenin : "లెనిన్" మూవీ నుంచి భారతి వ‌చ్చేసింది

by velandi.Saikiran |   (  Updated:2026-01-02 17:49:39  IST  )

"లెనిన్"లో భాగ్యశ్రీ పోస్టర్ వదిలింది చిత్ర బృందం. ఈ మూవీలో భారతి పాత్రలో భాగ్యశ్రీ కనిపించనున్నారట.

Lenin : లెనిన్ మూవీ నుంచి భారతి వ‌చ్చేసింది
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అక్కినేని అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా మెరువనున్నారు. ముందుగా ఈ సినిమాలో శ్రీ లీలను హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు. కానీ చివరి క్షణంలో భాగ్య శ్రీ ఫైనల్ అయింది. ఈ నేపథ్యంలోనే భాగ్యశ్రీ పోస్టర్ వదిలింది చిత్ర బృందం. ఈ మూవీలో భారతి పాత్రలో భాగ్యశ్రీ కనిపించనున్నారట. లేటెస్ట్ గా విడుదలైన భార‌తి పోస్టర్ లో పల్లెటూరి అమ్మాయిల భాగ్యశ్రీ మెరిసింది. కాగా అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న ఈ లెనిన్ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story