- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసక్తికరంగా ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ అనౌన్స్.. టైటిల్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
తరుణ్ భాస్కర్(Tharun Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది’(EE Nagaraniki Emaindhi).

దిశ, వెబ్‌డెస్క్: తరుణ్ భాస్కర్(Tharun Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది’(EE Nagaraniki Emaindhi). విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు(D. Suresh Babu) నిర్మించారు. ఇక ఇందులో సుశాంత్ రెడ్డి, వెంకటేష్, కాకమాను, అనిషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి వంటి తదితరులు కీలక పాత్రలో కనిపించారు. అయితే 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
అంతేకాకుండా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో రీసెంట్‌గా ఈ మూవీ సీక్వెల్ తీస్తున్నామంటూ మూవీటీమ్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకు ‘ఈఎన్ఈ రిపీట్’(ENE Repeat)) అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తూ టీమ్ ఒక స్పెషల్ వీడియో షేర్ చేసింది. ‘టీమ్ కన్యా రాశి వచ్చేసింది’ అంటూ ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. Link






