Sankranthiki Vasthunnam: వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..

by Chukka Sudharani |   (  Updated:2025-01-02 15:43:01  IST  )

విక్టరి వెంకటేష్ (Victory Venkatesh) నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sankranthiki Vasthunnam: వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..
X

దిశ, సినిమా: విక్టరి వెంకటేష్ (Victory Venkatesh) నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో తెరకెక్కున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పటడంతో వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌పై ఓ ఇంట్రెస్టింగ్ (Interesting) న్యూస్ వైరల్ అవుతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ట్రైలర్ (Trailer) జనవరి 6న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 2025 సంక్రాంతి స్పెషల్‌ (Special)గా జనవరి 14న ప్రపంపవ్యాప్తంగా ప్రేక్షకుల గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

Next Story