- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT: థగ్‌లైఫ్ ఓటీటీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ప్రీమియర్ ఒప్పందాన్ని రద్దు చేసిన చిత్ర బృందం!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్లుగా నటించగా.. శింబు ప్రధాన పాత్రలో కనిపించాడు. రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం జూన్ 5న థియేటర్స్‌లోకి వచ్చా పరాజయం పాలైంది. అలాగే పలు వివాదాలు కూడా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా అంతగా రాలేదు. అయితే.. రిలీజ్‌కు ముందు ‘థగ్‌లైఫ్’ సినిమాపై హై బజ్ క్రియేట్ కావడంతో ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు.. ఈ మూవీ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు టాక్.
అలాగే.. థియేటర్స్‌లో విడుదలైన 8 వారాల తర్వాత స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ క్రమంలోనే సినిమా ప్లాప్ కావడంతో.. 8 వారాల తర్వాత షెడ్యూల్ చేయబడిన OTT ప్రీమియర్ ఒప్పందాన్ని రద్దు చెయ్యాలని ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరుపుతున్నారట మూవీ టీమ్. ఈ చర్చలు మూవీ టీమ్‌కు అనుకూలంగా జరిగితే అనుకున్న టైమ్ కంటే ముందే ‘థగ్‌లైఫ్’ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తమిళ మీడియా నుంచి సమాచారం.
#ThugLife 📉
— Movie Tamil (@MovieTamil4) June 9, 2025
- The team is cancelling the OTT premiere deal that was scheduled for 8 weeks after the theatrical release.👀
Talks going with #NETFLIX #KamalHaasan #ManiRatnam #SilambarasanTR pic.twitter.com/HlAj3ixJfX






