Drishyam-3: దృశ్యం-3 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పటినుంచి స్టార్ట్ అంటే!

by Chukka Sudharani |

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ (Ajay Devgan) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘దృశ్యం’ ఒకటి.

Drishyam-3: దృశ్యం-3 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ ఎప్పటినుంచి స్టార్ట్ అంటే!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ (Ajay Devgan) కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘దృశ్యం’ ఒకటి. 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది. మలయాళ చిత్రం దృశ్యం(2013)కి రీమేక్‌గా వచ్చిన ఈ మూవీలో అజయ్ దేవగన్ విజయ్ సాల్వాంకర్ పాత్రలో నటించి మెప్పించగా.. దీనికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించాడు. ఇందులో టబు, శ్రియ శరణ్, ఇషితా దత్తా, మృణాల్ జాదవ్, రజత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం హిట్ కావడంతో దీనికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ కూడా వచ్చిన విషయం తెలిసిందే.

ఇందులో అజయ్ దేవగన్, అక్షయే ఖన్నా, టబు ప్రధాన పాత్రల్లో నటించగా.. దీనికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2022లో రిలీజైంది. ఇప్పుడు సినీ ప్రియులు దృశ్యం-3 కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్ట్‌-3 పై అప్డేట్ వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ట్వీట్ మేరకు.. ‘అజయ్ దేవగన్, దృశ్యం-3 షూటింగ్ అక్టోబర్ 2, 2025న ప్రారంభించనున్నారు.. 2026 గాంధీ జయంతి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.. మొత్తం సాల్వాంకర్ కుటుంబం మళ్లీ వచ్చింది.. ఈసారి, ఇది చివరి అధ్యాయం!’ అంటూ ఓ పోస్టర్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Tweet

Next Story