SSMB29 తర్వాత ఆ ఇద్దరు డైరెక్టర్లతో సినిమా లైన్‌లో పెట్టిన మహేశ్ బాబు!

by Chukka Sudharani |

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం ‘SSMB29’తో బిజీగా ఉన్నాడు.

SSMB29 తర్వాత ఆ ఇద్దరు డైరెక్టర్లతో సినిమా లైన్‌లో పెట్టిన మహేశ్ బాబు!
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం ‘SSMB29’తో బిజీగా ఉన్నాడు. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై సినీ ప్రియులతో పాటు ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనౌన్స్‌మెంట్‌తోనే ఫుల్ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తుండగా ఇందులో నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి అప్‌డేట్ రాలేదు కానీ, SSMB29 తర్వాత మహేశ్ బాబు నెక్ట్స్ ఏ డైరెక్టర్స్‌తో సినిమాలు చేయనున్నారు అనే దాని గురించి మాత్రం సోషల్ మీడియాలో వార్తలు హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.

ఈ మేరకు నెట్టింట ఓ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అందులో ‘SSMB29 తర్వాత మహేష్ బాబు ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి చాలా మంది దర్శకులు లైన్‌లో ఉన్నారు. ఇందుంలో ముఖ్యంగా యువ దర్శకులు నాగ్ అశ్విన్ (Nag Ashwin), బుచ్చిబాబు సనా (Buchibabu Sana) పేర్లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా నాగ్ అశ్విన్ ఇప్పటికే మహేశ్ బాబు కోసం హాలీవుడ్-స్కేల్ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు. అయితే.. ప్రజెంట్ ఆయన కల్కి సీక్వెల్‌తో బిజీగా ఉండటంతో దీనిని తెరకెక్కించేటప్పటికి రెండేళ్లు పట్టచ్చు. ఇక బుజ్జిబాబు సనా కూడా మహేశ్ బాబు కోసం కథ సిద్ధం చేయగా.. SSMB29 తర్వాత తెరకెక్కించే ఉద్దేశ్యంలో ఉన్నాడు’ అంటూ ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story